జియో లో గూగుల్ భారీ పెట్టుబడులు... 

జియో లో గూగుల్ భారీ పెట్టుబడులు... 

రిలయన్స్ జియో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో గూగుల్ భారీగా పెట్టుబడులు పెడుతున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు.  రిలయన్స్ 43 వ వార్షిక జనరల్ మీటింగ్ లో ముఖేష్ అంబానీ అనేక విషయాల గురించి మాట్లాడారు.  రిలయన్స్ జియోలో గూగుల్ రూ.33,737 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్టు అయన తెలిపారు.  దీంతో జియోలో గూగుల్ సంస్థ 7.7 శాతం వాటాను పొందినట్టు ముఖేష్ అంబానీ ప్రకటించారు.  జియోలో గూగుల్ వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుందని అయన తెలిపారు.  

మేడ్ ఇన్ ఇండియా జియో 5 జీ నెట్ వర్క్ ను తీసుకొస్తున్నట్టు అంబానీ తెలియజేశారు.  ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ప్రకటించిన ప్రధాని మోడీకి జియో 5జీని అంకితం చేస్తున్నట్టు పేర్కొన్నారు.  ఇండియాలో 5జీ స్పెక్ట్రమ్ అందుబాటులోకి రాగానే ట్రయల్స్ ప్రారంభిస్తామని అన్నారు.  ఇక దీంతో పాటుగా జియో కంపెనీ జియో టీవీ ప్లస్ ను  తీసుకొస్తున్నట్టు అంబానీ ఈ సందర్భంగా తెలియజేశారు.  ఇందులో 12 రకాల ఓటిటి ప్లాట్ ఫామ్ లు అందుబాటులో ఉంటాయని,  దీనిని వాయిస్ ద్వారా ఆపరేట్ చెయ్యొచ్చని  ముఖేష్ అంబానీ తెలిపారు.