గూగుల్ పే ప్ర‌తినిధిని అంటూ పోలీసుకే టోక‌రా...!

గూగుల్ పే ప్ర‌తినిధిని అంటూ పోలీసుకే టోక‌రా...!

రోజుకో కొత్త త‌ర‌హాలో సైబ‌ర్ మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. తాను గూగుల్ పే ప్ర‌తినిధిని అంటూ న‌మ్మ‌బ‌లికి ఏకంగా పోలీసుకే టోకారా పెట్టిన ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో వెలుగు చూసింది.. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లో జనార్దన్ గౌడ్ అనే కానిస్టేబుల్‌... గూగుల్ పే ద్వారా రెండు ద‌ఫాలుగా న‌గ‌దు బ‌దిలీ చేశాడు.. అయితే.. మొద‌టిసారి వెళ్లినా.. రెండోసారి సాంకేతిక కార‌ణాలతో సాధ్యం కాలేదంటూ ఓ సందేశం వ‌చ్చింది.. అయితే.. వెంటనే స‌ద‌రు కానిస్టేబుల్‌.. గూగుల్‌లో అన్వేషించి గూగుల్ పే క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌ర్ ప‌ట్టుకుని ఫోన్ కొట్టాడు.. ఆయ‌ను ఎలాంటి స‌మాధానం రాక‌పోగా.. కాసేటి త‌ర్వాత మ‌రో నంబ‌ర్ నుంచి.. ఫోన్ వ‌చ్చింది.. తాను గూగుల్ ఫే కస్టమర్ కేర్‌ ప్రతినిధిని అంటూ మాట క‌లిపాడు.. మీ డబ్బు వెనక్కి వ‌స్తుంద‌ని భ‌రోసా క‌ల్పించాడు.. అత‌డిని న‌మ్మిన కానిస్టేబుల్‌.. గూగుల్ పే నంబర్, పిన్ నంబర్ అన్నీ చెప్ప‌డంతో.. స‌ద‌రు కానిస్టేబుల్ ఖాతా నుంచి రూ.50వేలు కాజేశాడు. కాస్త ఆల‌స్యంగా విష‌యం గ్ర‌హించిన కానిస్టేబులో.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.