టెలికం సంస్థలతో గూగుల్ డీల్...! ఇక ఈ సేవలు కూడా...

టెలికం సంస్థలతో గూగుల్ డీల్...! ఇక ఈ సేవలు కూడా...

గూగుల్‌ సెర్చ్ ఇంజిన్‌లో దొరకనిదంటూ ఉండదు... అది ఎంత వరకు వెళ్లిందంటే... ఏదైనా ప్రశ్న ఉత్పన్నమైందంటే... వెంటనే గూగుల్ ఇట్ అనే స్థాయికి వెళ్లిపోయింది. ఇక, ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫాంపై గూగుల్‌ సెర్చ్‌ను వాడుతున్న యూజర్లకు గూగుల్‌ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక, గూగుల్‌ సెర్చ్‌ ద్వారానే యూజర్లు తమ ప్రీపెయిడ్‌ మొబైల్‌ను రీచార్జ్ చేసుకునే అవకాశం కలిపిస్తోంది గూగుల్... దీని కోసం ఇప్పటికే దేశంలోని టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియోతో పాటు ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌తోనూ డీల్ కుదుర్చుకుంది. గూగుల్‌ సెర్చ్‌లో ప్రీపెయిడ్‌ మొబైల్‌ రీచార్జి అని టైప్‌ చేసి... ఆ తర్వాత ఆప్షన్లలో మొబైల్‌ నంబర్‌, ఆపరేటర్‌, ప్లాన్‌ ఎంటర్ చేసి.. మొబైల్‌ రీచార్జి చేసుకునే వీలు కల్పిస్తోంది. ఇక, దీనికి సంబంధించిన మొత్తాన్ని చెల్లించడానికి మొబిక్విక్‌, పేటీఎం, ఫ్రీచార్జ్‌, గూగుల్‌ పే లాంటి పేమెంట్‌ ఆప్షన్లను కూడా అందిస్తోంది గూగుల్‌.