మహర్షిలో ఆ ట్విస్ట్ అదిరిపోతుందట..!!

మహర్షిలో ఆ ట్విస్ట్ అదిరిపోతుందట..!!

మహేష్ బాబు మహర్షి సినిమా ఆర్ఎఫ్సి షెడ్యూల్ నిన్నటితో కంప్లీట్ అయింది.  కొత్త సంవత్సరంలో కొత్త షెడ్యూల్ ను ప్రారంభిస్తారు.  ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక సమాచారం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది.  మహర్షి సినిమాలో ఓ సీన్ అదిరిపోతుందట.  ఆ సీన్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.  

మహేష్ యూఎస్ లో బిజినెస్ మెన్ గా ఉంటాడు.  యూఎస్ నుంచి ఇండియాకు వచ్చే సమయంలో కీలక ట్విస్ట్ తో కూడిన సన్నివేశం ఉంటుందని.. ఇది ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ కు కూడా గూస్ బమ్స్ వచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు.  ఏప్రిల్ 5 న మహర్షి రిలీజ్ కాబోతున్నది.  ఆ సీన్ ఏంటి.. కీలకమైన ట్విస్ట్ ఏంటి అని తెలియాలంటే రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.