బోర్డర్ లో దేశభక్తిని చాటిన గోపీచంద్

బోర్డర్ లో దేశభక్తిని చాటిన గోపీచంద్

టాలీవుడ్ స్టార్ నటుడు గోపీచంద్ కొత్త సినిమా ప్రస్తుతం రాజస్థాన్ లోని జైసల్మీర్ లో జరుగుతున్నది.  స్పైథ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ కొత్తగా కనిపిస్తున్నాడట.  హైవోల్టెడ్ యాక్షన్ సినిమాగా దర్శకుడు తీరు తెరకెక్కిస్తున్నారు.  

గణతంత్ర దినోత్సవం సందర్భంగా గోపీచంద్ షూటింగ్ సెట్స్ లో జాతీయ జెండాను ఎగరవేశారు. యూనిట్ అందరూ జాతీయ జెండా వేడుకలో పాల్గొన్నారు.  బోర్డర్ షూటింగ్ జరుపుకోవడం థ్రిల్లింగ్ గా ఉంటె, గణతంత్ర దినోత్సవ వేడుకను ఇండో... పాక్ సరిహద్దులో జరుపుకోవడం ఆనందంగా ఉందని గోపీచంద్ పేర్కొన్నాడు.