గాయాల నుంచి కోలుకున్న గోపీచంద్

గాయాల నుంచి కోలుకున్న గోపీచంద్

గోపీచంద్ స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు.  తమిళ దర్శకుడు తీరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.  జైపూర్ లోని రాజస్థాన్ లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో గోపీచంద్ గాయపడ్డారు.  రిస్కీ బైక్ రేస్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.  దీంతో రెండు నెలలుగా సినిమా షూటింగ్ ను నిలిపివేశారు.  

గాయాల నుంచి గోపీచంద్ కోలుకోవడంతో తిరిగి షూటింగ్ ను జూన్ 5 నుంచి ప్రారంభించబోతున్నారు.  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  బాలీవుడ్ నటి జరీన్ ఖాన్, మెహ్రీన్ లు హీరోయిన్లు.  అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.