ఎఫ్3లో ఆ హీరో కూడా చేస్తున్నాడా..?

ఎఫ్3లో ఆ హీరో కూడా చేస్తున్నాడా..?

వెంకటేష్, వరుణ్ తేజ్‌లు ప్రధాన పాత్రలుగా వచ్చిన సినిమా ఎఫ్2కు సీక్వెల్‌గా మరో సినిమా రానున్న విషయం తెలిసిందే. అయితే దానికి ఎఫ్3 టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాను కూడా దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. అయితే ఎఫ్3 కథ ఎఫ్2కు పూర్తి భిన్నంగా ఉంటుందని తెలిపారు. అయితే ఇటీవల వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో డబ్బు కట్టలు కుప్ప పోసుకొని వరుణ్ తేజ్, వెంకటేష్‌లు పరిగెడుతూ కనిపించారు. దాంతో ఈ సినిమా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేవి డబ్బు కారణంగా వస్తాయని అనుకున్నారు. అయితే ఈ సినిమాలో వీరితోపాటుగా మరో కథానాయకుడు కూడా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. ఇటీవల ఆ హీరో ఎవరో కాదు గోపీ చంద్ అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎఫ్3 దర్శకుడు అనిల్ రావిపూడి అందరికి ఈ సినిమాలో మూడో హీరోకి స్థలం లేదని అన్నాడు. మరి ఈ సినిమాలో గోపీచంద్ ఉన్నాడా, లేదా అనేది దానిపై ఇంకా క్లారిటీ లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ఎఫ్3 సినిమా తన చిత్రీకరణను వచ్చే ఏడాదిలో ప్రారంభించనుంది. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు చాలా పెరిగాయి. మరి సినిమా వాటిని అందుకుంటుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.