గోపినాథ్‌ ముండేది హత్య?

గోపినాథ్‌ ముండేది హత్య?

కేంద్ర మంత్రిగా ఉంటూ రోడ్డు ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర నేత గోపినాథ్‌ ముండేది హత్యే అని సైబర్‌ నిపుణుడు, ఈసీఐఎల్‌ మాజీ ఉద్యోగి సయ్యద్‌ షుజా ఆరోపించారు. 2014 ఎన్నికల్లో ఈవీఎంలను రిగ్గింగ్‌ చేశారని, ఆయన విషయం ముండేకు తెలుసని ఆయన చెప్పారు. ఆయన బయట పెడతారనే ఆయనను చంపేశారని ఆయన ఆరోపించారు. ఈవీఎంల హ్యాకింగ్‌ గురించి ఇవాళ లండన్‌లో నిపుణల మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనాలని భావించిన సయ్యద్‌ షుజాపై నాలుగు రోజుల క్రితం దాది జరిగింది. దీంతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

అధికారి ఆత్మహత్య
గోపినాథ్‌ ముండే మృతిపై నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సి (ఎన్‌ఐఏ) దర్యాప్తు చేసింది. దర్యాప్తు అధికారి తంజీల్‌ అహ్మద్‌...ముండేది హత్య అని గుర్తించారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలని అనుకుంటున్న సమయంలో తంజీల్‌ అహ్మద్‌ ఆత్మహత్య చేసుకున్నాడని సయ్యద్‌ షుజా తెలిపారు. షుజా 2009 నుంచి 2014 వరకు ఈజీఐఎల్‌లో పనిచేశారు. 2014లో వినియోగించిన ఈవీఎంల డిజైన్‌ చేసిన బృందంలో తాను ఉన్నట్లు షుజా తెలిపారు.