'ఆయన కుమారుడు, కుమార్తె కోట్లు దోచుకున్నారు'

'ఆయన కుమారుడు, కుమార్తె కోట్లు దోచుకున్నారు'

నరసరావుపేట, సత్తెనపల్లిలో మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబం అరాచకాలు అన్నీఇన్నీ కావని, వేలాది మందిని 'కె-ట్యాక్స్‌' పేరుతో ఇబ్బంది పెట్టారని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన తర్వాత తనపై కేసులు పెట్టారని కోడెల అనడం సరికాదన్నారు. 'నరసరావుపేటలో మీరు ఎప్పుడైనా ప్రోటోకాల్ పాటించారా? ఏ స్పీకరైనా మీలా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారా?  స్పీకర్ పదవిలో ఉండి కూడా మీరు జగన్‌ని ఎన్ని సార్లు తిట్టారో గుర్తులేదా?' అని కోడెలను ప్రశ్నించారు. 

కోడెలపై కేసులు పెడుతోంది టీడీపీ నేతలేనన్న గోపిరెడ్డి.. 'కె-ట్యాక్స్‌'పై ఫిర్యాదు చేయడానికి వేలాది మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు.  'కె-ట్యాక్స్‌'పై సీబీసీఐడీ దర్యాప్తు చేపట్టాలని అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని ఆయన చెప్పారు. కోడెల కుమారుడు, కుమార్తె కోట్లు దోచుకుతిన్నారన్న గోపిరెడ్డి.. ఈ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించేందుకు టీడీపీ కార్యకర్తలపై దాడి అంటూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.