బుమ్రా, అనుపమ డేటింగ్..

బుమ్రా, అనుపమ డేటింగ్..

మన భారత క్రికెట్ జట్టులో ఉన్న యువ బ్యాచిలర్ ఆటగాళ్లపై ఈమధ్య రూమర్లు కొంచెం ఎక్కువే అయ్యాయి.  పలువురు సినీ హీరోయిన్లతో ప్రేమాయణం సాగిస్తున్నారని గతంలోనే వార్తలు రాగా తాజాగా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై కూడా ఇలాంటి వార్తలే వస్తున్నాయి.  దక్షిణాది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తో ఆటను డేటింగ్ చేస్తున్నట్టు సోషల్ మీడియా గుప్పుమంటోంది.  అందుకు కారణం బుమ్రా తన ట్విట్టర్ ఖాతాలో ఫాలో అవుతున్న సెలబ్రిటీల్లో లేడీ సెలబ్రిటీ అనుపమ ఒక్కటే ఉండటం ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది.  మరి నిజంగానే వీరి మధ్యన ప్రేమాయణం నడుస్తోందా లేకపోతే ఇవన్నీ ఒట్టి రూమర్లు మాత్రమేనా అనేది ఇరువురిలో ఎవరో ఒకరు స్పందిస్తేనే తెలుస్తుంది.