షాకింగ్..! 21 రకాల మెడిసిన్స్‌ ధరల పెంపు..?

షాకింగ్..! 21 రకాల మెడిసిన్స్‌ ధరల పెంపు..?

మెడిసిన్స్‌పై మీ ఖర్చు పెరిగిపోనుంది... ఇప్పటి వరకు రూ.100 ఖర్చు చేస్తూ ఉంటే... అదనంగా మరో రూ.50 చిల్లు పడబోతోంది... ఇప్పటికే వివిధ రకాల వస్తువుల ధరలు పెరిగిపోయి భారంగా మారగా... ఇక దేశంలో అత్యధికంగా ఉపయోగించే 21 రకాల మెడిసిన్‌ ధరలు త్వరలో పెరగే అవకాశముంది. వీటిలో యాంటీ బయోటిక్స్‌తో పాటు ఎలర్జీ, మలేరియా నివారణ, బీసీజీ వాక్సిన్‌, విటమిన్‌ సి వంటి మందులు ఉన్నాయి. గత కొంత కాలంగా మందుల ధరలు పెంచాలని మెడిసిన్స్‌ తయారు చేసే కంపెనీలు కోరుతున్నాయి. ఈ క్రమంలో మందుల ధరలు 50శాతం పెంచుకునేందుకు నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ అనుమతిచ్చింది. దీంతో త్వరలోనే ఈ వడ్డింపు తప్పదంటున్నారు విశ్లేషకులు.