రాజీనామా తర్వాత తొలిసారి ఉర్జిత్ పటేల్ ఇలా..

రాజీనామా తర్వాత తొలిసారి ఉర్జిత్ పటేల్ ఇలా..

ఆర్బీఐ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆర్బీఐ పనితీరు, బ్యాంకుల వ్యవహారంపై తొలిసారి స్పందించారు ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్.. ఆర్బీఐ గవర్నర్‌, డిప్యూటీ గవర్నర్‌ హోదాలో దాదాపు ఐదేళ్ల కాలం పాటు పనిచేసిన ఉర్జిత్.. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. స్థూల నిరర్థక ఆస్తులు, మొండి బకాయిల వసూళ్ల విషయంలో గవర్నమెంట్, బ్యాంకులు 2014 వరకు విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు. వాటి ఫలితంగానే మూలధనం కొరత ఏర్పడిందని... ఇప్పుడు యథాతథ స్థితికి చేరడం కూడా కష్టమైన పనిగా వెల్లడించారు. బ్యాంకులు విచ్చల విడిగా రుణాలు ఇచ్చాయి, ప్రభుత్వం తన పాత్రను సమర్థవంతంగా పోషించలేకపోయింది, చర్యలు తీసుకోవడంలో ఆర్‌బీఐ ఆలస్యం చేసిందన్నారు. 

అయితే, రఘురామ్‌ రాజన్‌ బ్యాంకుల ఆస్తుల నాణ్యత సమీక్ష మొదలు పెట్టిన తర్వాత వ్యవస్థలో ఎంత ఒత్తిడి నెలకొందన్నారు ఉర్జిత్ పటేల్... ఈ చర్యలు ఆర్థిక వ్యవస్థకు బ్యాంకులు సరిపడా నిధులు అందజేసే సామర్థ్యాన్ని తగ్గించాయని.. వృద్ధిరేటు మందగించింది. అలా అని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ చర్యలను కొనసాగించాలి. వెనక్కి వెళ్లడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థతో అంతర్గత సంబంధాల వల్ల బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఆస్తుల నాణ్యత సమీక్ష తప్పనిసరి అని స్పష్టం చేసిన ఆర్బీఐ మాజీ గవర్నర్... సుప్రీం కోర్టు 2018 ఫిబ్రవరి 12న ఇచ్చిన తీర్పు నాకూ ప్రభుత్వానికి మధ్య  దూరం పెంచిందని గుర్తుచేసుకున్నారు. మరోవైపు బలహీనపడిన బ్యాంకులను విలీనం చేసుకోవడంతో మొత్తం సంస్థ విలువ తగ్గుతుందని పేర్కొన్నారు ఉర్జిత.. ఐడీబీఐ, ఎల్‌ఐసీ విలీనం అత్యంత సమస్యాత్మాకమ్మం అన్న ఆయన... ప్రైవేటు బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వహణేతర ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే మూడు పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు 2019 -20 ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన మూలధనంలో రూ. 250 బిలియన్లకు పైగా అవసరమవుతాయని అభిప్రాయపడ్డారు ఉర్జిత్ పటేల్.