బీమా బ్రోకింగ్‌లో వందశాతం ఎఫ్‌డీఐ?

బీమా బ్రోకింగ్‌లో వందశాతం ఎఫ్‌డీఐ?

బీమారంగంలో బ్రోకింగ్‌ లావాదేవీలు నిర్వహించే కంపెనీల్లో వంద శాతం విదేశీ పెట్టుబడులకు (ఎఫ్‌డీఐలకు) అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడొచ్చని వార్తలు వస్తున్నాయి. బీమా కంపెనీల్లో మాత్రం ఇపుడున్న పరిమితి కొనసాగనున్నాయి. ఫైనాన్షియల్‌ కంపెనీ ఇంటర్మీడిటరీ కంపెనీల మాదిరిగా బీమా బ్రోకింగ్‌ ను పరిగణించాలని బీమా పరిశ్రమకు చెందిన పలు కంపెనీలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం బీమా కంపెనీలతో పాటు ఇన్సూరెన్స్ బ్రోకింగ్‌, థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్, సర్వేయర్స్, లాస్‌ అసెసీస్‌ వంటి సంస్థల్లో 49 శాతం ఎఫ్‌డీఐకి ప్రభుత్వం అనుమతించింది. ఇందురలో బీమా బ్రోకింగ్‌ సంస్థల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతించనుంది.