బీమా చెల్లింపులపై కలెక్టర్లకు సర్కార్ ఆదేశం

బీమా చెల్లింపులపై కలెక్టర్లకు సర్కార్ ఆదేశం

అకాల వర్షాలతో పలు జిల్లాల్లో పంట నష్టాన్ని అంచనా వేసి బీమా చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. పంటనష్టాన్ని అంచనా వేసి వివరాలను సంబంధిత బీమా కంపెనీలకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరింది. రాష్ట్రంలో 1 లక్షా 40 వేల మంది ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద పంట బీమా చేయించుకున్నారని, ఆమేరకు వెంటనే రైతులకు బీమా మొత్తం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. అకాల వర్షాలకు కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ అర్బన్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వరి, మొక్క జొన్న, వేరు శెనగ, శెనగ, మినుములు పంటలకు నష్టం జరిగింది.