ఆ విషయంలో సుప్రీం కోర్టును మరింత సమయం కోరిన ప్రభుత్వం...

ఆ విషయంలో సుప్రీం కోర్టును మరింత సమయం కోరిన ప్రభుత్వం...

దేశంలో “కరోనా” వైరస్ విజృంభిస్తున్న సమయంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ, వడ్డీపై వడ్డీ వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. మారిటోరియం సమయంలో రుణాలపై వడ్డీ, వడ్డీ పై వడ్డీ వసూలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలపడానికి మరొక రెండు మూడు రోజుల సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అడిగారు. రుణాలపై వడ్డీ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ప్రక్రియ తుది దశలో ఉందని సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం కోరిన గడువును ఇస్తూ ఈ పిటిషన్ల పై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.