ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు షాక్‌..! నోటీసులు జారీచేసిన కేంద్రం

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు షాక్‌..! నోటీసులు జారీచేసిన కేంద్రం

ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు షాక్‌ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం... ఓ వైపు పండుగను క్యాష్ చేసుకునే పనిలో భాగంగా ఆఫర్లతో ఆకట్టుకుంటూ సేల్స్‌ పెంచుకునేందుకు ప్రత్యేక సేల్‌ నిర్వహిస్తున్నాయి రెండు సంస్థలు.. బిగ్‌బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ సేల్స్‌ పేరుతో బిజినెస్ జరుగుతోంది.. అయితే.. ఈ ఈ-కామర్స్ సంస్థల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఒక వస్తువును వెబ్‌సైట్‌లో అమ్ముతున్నప్పుడు.. ఆ వస్తువుకు సంబంధించిన మూలం, ఏ దేశంలో తయారైందన్న సమాచారాన్ని కూడా అక్కడే వినియోగదారుడికి తెలియజేయాలన్న తప్పనిసరి నిబంధనను అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ గానీ, ఇతర ఈ-కామర్స్‌ సంస్థలు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసింది కేంద్రం. దీనిపై వివరణ కోరుతూ ఆ రెండు సంస్థలతో పాటు మరికొన్ని ఈ-కామర్స్‌ సంస్థలకు నోటీసులు జారీ చేసింది కేంద్ర సర్కార్. కాగా, భారత్-చైనా బోర్డర్‌లో పరిస్థితులు మారిపోయి.. యుద్ధవాతావరణం నెలకొన్ని తర్వాత.. చైనా యాప్స్‌ను పెద్ద సంఖ్యలో బ్యాన్ చేసింది కేంద్రం.. ఇదే సమయంలో.. చైనా వస్తువులను బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతూ వచ్చిన సంగతి తెలిసిందే.