కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో జగన్‌ కీలక నిర్ణయం

కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో జగన్‌ కీలక నిర్ణయం

కాంట్రాక్ట్‌  ఉద్యోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేబినెట్‌ సబ్‌కమిటీని నియమించింది. ఉద్యోగులను క్రమబద్ధీకరించే విషయంలో ఈ సబ్‌కమిటీ అధ్యయనం చేస్తుంది. అన్ని అంశాలనూ పరిశీలించిన ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. ఈ కేబినెట్‌ సబ్‌కమిటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేశ్, ఆళ్ల నాని ఉన్నారు.