ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నీటి వినియోగదారుల సంఘాలు, ప్రాజెక్టు కమిటీలను రద్దు చేస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీచేసింది. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ సిఫార్సుల మేరకు ప్రస్తుత కమిటీలను ప్రభుత్వం రద్దు చేసింది. కమిటీల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 5766 నీటి వినియోగదారుల సంఘాలు, 49 ప్రాజెక్టు కమిటీలు, 244 నీటి పంపిణీ సంఘాల్లో ప్రత్యేక అధికారుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీటి వినియోగదారుల సంఘాలకు  జలవనరుల శాఖలోని స్థానికంగా ఉండే  డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను, నీటి పంపిణీ సంఘాలకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం పేర్కొంది. ప్రాజెక్టు కమిటీలకు సూపరిండెంట్ ఇంజనీర్లను ప్రత్యేకాధికారిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.