కిడారి రాజీనామాను ఆమోదించిన గవర్నర్

కిడారి రాజీనామాను ఆమోదించిన గవర్నర్

ఏపీ మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ మంత్రి పదవికి రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. గురువారం స‌చివాల‌యంలోని సీఎంవో అధికారుల‌కు కిడారి శ్రావ‌ణ్ త‌న రాజీనామా లేఖ‌ను అంద‌జేసిన విషయం తెలిసిందే.  సచివాలయంలోని సీఎంవో అధికారుల నుంచి గవర్నర్ నరసింహన్‌కు ఈ రాజీనామా లేఖ వెళ్లింది. కాగా.. గురువారం సాయంత్రం కిడారి రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. 

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు హత్య చేయడంతో అతని కుమారుడు శ్రావణ్‌ కుమార్‌కు ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి పదవిని అప్పగించారు. శ్రావణ్‌ గతేడాది నవంబర్‌ 11న మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాజ్యాంగ నియమావళి ప్రకారం మంత్రి పదవిలో ఉన్నవారు ఆరు నెలల్లోగా చట్టసభల్లో సభ్యులుగా ఎన్నిక కావాలి. ఈనెల 10వ తేదీతో ఆ గడువు ముగుస్తుండడంతో ఆ తర్వాత నుంచి ఆయన మంత్రి పదవిలో కొనసాగే వీలు లేని నేపథ్యంలో రాజీనామా చేయాల్సిన వచ్చింది.