'నేను ఉత్సవ విగ్రహాన్ని కాదు..'

'నేను ఉత్సవ విగ్రహాన్ని కాదు..'

తాను ఉత్సవ విగ్రహాన్ని కాదని ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. తాను నరసింహన్‌ని అని.. అంతటా ఉంటానని చలోక్తి విసిరారు. కాంగ్రెస్ నాయకులు.. రాజకీయ ఫిరాయింపుల మీద గవర్నర్‌కి వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. గవర్నర్‌ సిబ్బంది ఒకరు.. కాంగ్రెస్‌ నేత గూడూరు నారాయణరెడ్డిని గవర్నర్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ స్పందిస్తూ తనను ఉత్సవ విగ్రహం అని గతంలో గూడురు అన్నారని.. కానీ.. తాను నరసింహన్‌ని అని వ్యాఖ్యానించారు.