ముగిసిన గవర్నర్ డెడ్‌లైన్.. మరింత ఉత్కంఠ..!

ముగిసిన గవర్నర్ డెడ్‌లైన్.. మరింత ఉత్కంఠ..!

కాంగ్రెస్-జేడీ(ఎస్‌) సంకీర్ణ సర్కార్ ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటల వరకు విశ్వాస పరీక్ష నిర్వహించాలంటూ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్‌ వాలా పెట్టిన డెడ్‌లైన్ ముగిసిపోయింది. గవర్నర్‌ సూచనలను సీఎం కుమారస్వామి గానీ, స్పీకర్ రమేష్ కుమార్ గానీ పట్టించుకోలేదు. మరోవైపు సభలో గవర్నర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్-జేడీఎస్ సభ్యులు నినాదాలు చేశారు. అయితే, గవర్నర్ ఆదేశాలను స్పీకర్ ధిక్కరించడంతో తర్వాత ఏం జరుగుతోందనే ఉత్కంఠ నెలకొంది. ఇక, తనను సుప్రీం కోర్టు, గవర్నర్ శాసించలేరని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. విశ్వాసపరీక్షపై చర్చ పూర్తి కాకుండా బల పరీక్ష నిర్వహించలేమని తేల్చి చెప్పారు స్పీకర్. మరోవైపు విధానసభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేసిన స్పీకర్... గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు... విశ్వాసపరీక్షపై ఆయనకు గవర్నర్‌కు వివరణ ఇవ్వనున్నారు.