కర్ణాటక స్పీకర్‌కు గవర్నర్‌ కీలక ఆదేశాలు..

కర్ణాటక స్పీకర్‌కు గవర్నర్‌ కీలక ఆదేశాలు..

కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్‌ కూటమి అగ్నిపరీక్ష ఎదుర్కొంటోంది. అసెంబ్లీలో ఇవాళ్టి బలపరీక్షను వాయిదా వేయించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించడం.. వాటిని బీజేపీ అడ్డుకోవడం వంటి ఘటనల నేపథ్యంలో గవర్నర్‌ వాజూభాయి కీలక ఆదేశాలిచ్చారు. ఇవాళ రాత్రికల్లా బలపరీక్ష జరిగేలా చూడాలని స్పీకర్‌ రమేశ్ కుమార్‌ను ఆదేశించారు. 
బలపరీక్ష విషయమై బీజేపీ నేతలు గవర్నర్ వాజుభాయ్‌ను కలిసి విజ్ఞప్తి చేయగా.. ఇవాళే బలపరీక్ష ముగించాలనంటూ ఆయన రాజ్‌భవన్ నుంచి ఆదేశిస్తూ లేఖ పంపించారు. ఐతే.. ఈ వ్యవహరంలో గవర్నర్ ఆదేశాలివ్వడమేంటంటూ కాంగ్రెస్‌ సభ్యులు వాదిస్తున్నారు.