జగన్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు

జగన్ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు

ఏపీ సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు అయింది. ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు రాజభవన్‌ వర్గాలు అధికారికంగా ప్రకటన చేశాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు గవర్నర్‌ కార్యదర్శి సురేంద్ర మోహన్‌ ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. కాగా అంతకు ముందు వైఎస్‌ జగన్‌ రాజభవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. వైసీపీ ఎల్పీ తీర్మాన ప్రతిని అందచేసిన జగన్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. గవర్నర్ ను కలిసిన వారిలో వైఎస్‌ జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్‌ ఉన్నారు. కాగా మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సాఆర్‌ సీపీ 151, తెలుగుదేశం పార్టీ 23, జనసేన పార్టీ 1 స్థానాన్ని గెలిచిన విషయం తెలిసిందే.