జేఎన్టీయూ స్నాతకోత్సవంలో గవర్నర్ నరసింహన్

జేఎన్టీయూ స్నాతకోత్సవంలో గవర్నర్ నరసింహన్

బ్యాంకింగ్‌, కమ్యూనికేషన్‌ రంగాల్లో సైబర్‌ నేరాలు పెరిగిపోయాయని.. వీటిని సమూలంగా అణచివేసే స్థాయికి సాంకేతికత చేరాలని గవర్నర్ నరసింహన్‌ ఆకాక్షించారు. హైదరాబాద్ జేఎన్టీయూ ఎనిమిదో స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. మొబైల్‌ ఫోన్లతో మానవ సంబంధాలు దూరం అవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. నీరు, బొగ్గు వనరులు నానాటికీ తగ్గిపో తున్నాయని.. సౌర విద్యుదుత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు గ్రామాలను దత్తత తీసుకొని సామాజిక అంశాలపై ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరినప్పటికీ గురువులను మర్చిపోవద్దని సూచించారు. అనంతరం పీహెచ్‌డీ, డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు గవర్నర్‌ బంగారు పతకాలు ప్రదానం చేశారు.