స్పీకర్ పోచారంను పరామర్శించిన గవర్నర్

స్పీకర్ పోచారంను పరామర్శించిన గవర్నర్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని గవర్నర్ నరసింహన్ పరామర్శించారు. ఈ నెల 5న స్పీకర్ తల్లి పాపవ్వ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండలం పోచారంలో శనివారం జరిగిన ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ బంజారాహిల్స్ లోని స్పీకర్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.