మెట్రో రైలులో గవర్నర్‌ 

మెట్రో రైలులో గవర్నర్‌ 

హైదరాబాద్‌ మెట్రో రైలులో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఇవాళ ప్రయాణించారు. అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా బేగంపేట్‌ మెట్రో స్టేషన్‌కు వచ్చిన నరసింహన్‌ దంపతులు మెట్రో రైలు ఎక్కి అమీర్‌పేట్‌ జంక్షన్‌లో దిగారు. అక్కడి నుంచి మియాపూర్‌కు కనెక్టింగ్‌ ట్రైన్‌లో వెళ్లారు. సమాచారం అందుకున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డికి మియాపూర్‌ చేరుకున్నారు.  మెట్రో సదుపాయాలపై గవర్నర్‌ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ, సిబ్బందిని అభినందించారు.