ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై గవర్నర్ ఆగ్రహం

ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై గవర్నర్ ఆగ్రహం

ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పాసైన విద్యార్ధులు.. ఇంటర్ లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? వారికి సున్నా మార్కులు రావడం ఏంటి అని అధికారులను ప్రశ్నించారు. ఇంటర్ విద్యార్ధుల ఆందోళనలతో తాజా పరిస్థితిపై నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. బుధవారం రాత్రి ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అవోక్ రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ తో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించారు. విద్యార్ధులకు పలు సబ్జెక్టుల్లో సున్నా మార్కులు రావడమేంటని అడిగారు. ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు.