గవర్నర్ ఉగాది శుభాకాంక్షలు

గవర్నర్ ఉగాది శుభాకాంక్షలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు ప్రపంచ దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలందరికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలందరూ ఉగాది పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ వికారి నామ సంవత్సరం తెలుగు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఈ సంవత్సరం అంతా తెలుగు ప్రజలకు శుభప్రదంగా, సంతోషమయంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.