ఆ వర్సిటీలపై గవర్నర్‌ సీరియస్‌

ఆ వర్సిటీలపై గవర్నర్‌ సీరియస్‌

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలల్లో పీహెచ్‌డీ ప్రవేశాలపై గవర్నర్‌ నరసింహన్‌ ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. చాలా విశ్వవిద్యాలయాలు నిబంధనలు పాటించడం లేదని ఆయన దృష్టికి వెళ్లడంతో పీహెచ్‌డీల వివరాలను ఈనెల 17వ తేదీలోగా ఇవ్వాలని ఆదేశించారు. ఈమేరకు అన్ని విశ్వవిద్యాలయాలకు ఉన్నత విద్యా మండలి లేఖలు రాస్తోంది. గత ఆరేళ్లుగా ఎంతమందికి పీహెచ్‌డీ అడ్మిషన్లు ఇచ్చారు? ఎంతమందికి పీహెచ్‌డీలు ప్రదానం చేశారు? గైడ్స్‌ ఎంతమంది ఉన్నారు? సరాసరి ఏటా ఎంతమందికి ఇస్తున్నారు? తదితర వివరాలను అందించాల్సిందిగా ఉన్నత విద్యామండలి ఆ లేఖల్లో పేర్కొంది.