హ్యాపీ బర్త్‌డే టూ యూ: బాబుకు గవర్నర్‌ ఫోన్‌

హ్యాపీ బర్త్‌డే టూ యూ: బాబుకు గవర్నర్‌ ఫోన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరశింహన్‌ బాబుకు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని గవర్నర్‌ ఆకాంక్షించారు.