యువతకు సైనిక శిక్షణ...?

యువతకు సైనిక శిక్షణ...?

క్రమశిక్షణా, జాతీయవాదంతో 'యూత్‌ ఫోర్స్' పేరుతో ప్రతీ ఏడాది 10 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వాలన్న ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం చర్చిస్తోంది. దీని నేషనల్ యూత్ సాధికారత పథకం, ఎన్-ఎస్‌గా పిలుస్తారు. ఇది దేశ ప్రయోజనాన్ని పెంచేవిధంగా... టెన్త్ క్లాస్, 12వ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించి శిక్షణ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. 12-నెలల శిక్షణ కోసం స్థిరమైన స్టైఫండ్ అందించనున్నారు. రక్షణశాఖ, పారామిలిటరీ దళాలు, పోలీసు శాఖలో ఉద్యోగాల కోసం దీనిని "అత్యవసర అర్హత"గా కూడా చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ ప్రతిపాదనపై జూన్ చివరి వారంలో పీఎంవో చర్చించింది. రక్షణ మంత్రిత్వశాఖ, యువజన వ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 

అయితే ఈ  సమావేశంలో కొందరు అధికారులు ఎస్‌-ఎస్ గురించి లేవనెత్తినట్టు సమాచారం. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న ఎన్‌సీసీని మరింత బలోపేతం చేస్తే మంచిదన్న మరొక సూచన కూడా చేసినట్టు తెలుస్తోంది. కొత్త ఈ ప్రతిపాదన ప్రకారం, యువతకు... జాతీయత, క్రమశిక్షణ, ఆత్మగౌరవం యొక్క విలువలను ఈ పథకం ప్రోత్సహిస్తుంది. సైనిక శిక్షణకు అదనంగా, యోగా, ఆయుర్వేద, పురాతన భారతీయ తత్వశాస్త్రాలపై అవగాహన, వృత్తి, ఐటీ నైపుణ్యాలు, విపత్తు నిర్వహణ, భారతీయ విలువలపై శిక్షణ ఇస్తారు. గ్రామీణ యువత, బాలికలకు ఈ పథకం కింద శిక్షణ ఇవ్వాలని ప్రత్యేక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి... ఎన్‌సీసీ, నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్), నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు ఎంఎన్ఆర్ఈజీఏ ఫండ్‌లో అందుబాటులో ఉన్న నిధులను ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చని ప్రతిపాదించారు. యువతకు సరైన ఉద్యోగ అవకాశాలను సృష్టించడంలో విఫలమయ్యారంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దాడి ప్రారంభించిన సమయంలో ఈ శిక్షణా కార్యక్రమం ప్రతిపాదించబడింది. అయితే ఈ ప్రతిపాదన తొలిసారి ఏ మీ కాదంటున్నాయి నివేదికలు... గత ఏడాదిలోనే ప్రధాన మంత్రి కార్యాలయం... పాఠశాల విద్యలోనే క్రమశిక్షణ, శారీరక ధృడత్వం, దేశభక్తిపై క్లుప్తంగా - సాధారణ పాఠశాలల్లో కూడా చేర్చాలని ప్రతిపాదించింది. ఈ ఏడాది పైలట్ ప్రాతిపదికన ఏడు నవోదయ విద్యాలయాల్లో సైనిక్ స్కూల్ ఫీచర్లు పరిచయం చేయడంలో ప్రస్తుతం మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది.