వడదెబ్బతో బస్సులోనే ప్రభుత్వ ఉద్యోగి మృతి

వడదెబ్బతో బస్సులోనే ప్రభుత్వ ఉద్యోగి మృతి

వడదెబ్బతో ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రయాణిస్తున్న బస్సులోనే మృతిచెందారు. కాకినాడ అటవీశాఖలో పని చేస్తున్న మడి గంగరాజు ఇవాళ ఉదయం భార్యతో కలిసి కుమారుడి దగ్గరకు బయల్దేరారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో గంగరాజు మధ్యలోనే అస్వస్థతకు గురై... బస్సులోనే మృతి చెందారు. అప్పటివరకూ తనతో మాట్లాడిన భర్త విగతజీవిగా మారడంతో భార్య భోరున విలపించారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.