ఆర్టీసీ సమ్మె.. ఇక షెడ్యూల్ ప్రకారం బస్సులు..!

ఆర్టీసీ సమ్మె.. ఇక షెడ్యూల్ ప్రకారం బస్సులు..!

ఓ వైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగుతుండగానే.. గురువారం నుంచి అన్ని డిపోల్లో షెడ్యూల్‌ ప్రకారం బస్సులు నడవనున్నాయని ప్రకటించారు తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్. సమ్మె అనంతరం పరిణామాలపై ఆర్టీసీ అధికారులు, ఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి.. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కొన్ని ప్రాంతాల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న వార్తలు రావడంతో.. అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతీ బస్సులో టికెట్‌ ధరల పట్టిక పెడతామని.. టికెట్‌ ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇక, సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి ఆర్టీసీ ప్రత్యామ్నాయంగా నడుపుతోన్న బస్సుల్లో.. బస్‌పాస్‌లు నడవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.. దీనిపై స్పందించిన మంత్రి.. ప్రతీ బస్సులో పాస్‌లు కచ్చితంగా అనుమతించాల్సిందేనని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.