వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో ఆడొద్దు

వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో ఆడొద్దు

జూన్ లో జరగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థులు పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడకుండా ఉండేందుకు భారత్ సిద్ధమైంది. పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడొద్దని భారత ప్రభుత్వం బీసీసీఐ, పాలక మండలికి సూచించింది. పాక్ పై ఒత్తిడి పెంచేందుకు వరల్డ్ కప్ నాకౌట్ దశతో సహా ఏ మ్యాచ్ లో ఆ జట్టుతో ఆడకుండా ఉండేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. పాకిస్థాన్ తో టీమిండియా మ్యాచ్ ఆడాలా వద్దా నిర్ణయించేందుకు ప్రస్తుతం సీఓఏ, బీసీసీఐ సమావేశమవుతున్నాయి. గురువారం సుప్రీంకోర్ట్ సీఓఏని నియమించింది. తమ దేశ నిర్ణయం గురించి బీసీసీఐ, సీఓఏలు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి వివరించనున్నాయి. కనీసం నాకౌట్ దశ వరకైనా భారత్, పాకిస్థాన్ ఎదురుపడకుండా టోర్నమెంట్ ఫార్మాట్ మార్చాల్సిందిగా కోరే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఐసీసీ, స్పాన్సర్స్ పై విపరీతమైన ఆర్థిక ఒత్తిడి పెరిగిపోతుంది. ఫలితంగా పాకిస్థాన్ కి ఒత్తిడి, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చు. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మాంచెస్టర్ లో జూన్ 16న తలపడాల్సి ఉంది. కానీ పుల్వమా ఉగ్రవాద దాడి తర్వాత మాజీ క్రికెటర్లతో సహా భారతదేశ ప్రజలందరూ బాయ్ కాట్ చేయాలని ముక్తకంఠంతో చెబుతున్నారు.