జీఎస్టీ రిటర్న్‌ ఇక సులభం..

జీఎస్టీ రిటర్న్‌ ఇక సులభం..

జీఎస్టీ రిటర్న్‌ దాఖలను సులభతం చేసే దిశగా మరో ముందడుగు పడింది. ప్రస్తుతం ప్రతి నెలా ఒకటికి మించి రిటర్నులు దాఖలు చేయాల్సి వస్తుండగా, ఇకపై ఒకే రిటర్న్‌ దాఖలు చేసే విధానానికి జీఎస్టీ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ 27వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి నెలా  సింగిల్ పేజీతో స‌రికొత్త రిట‌ర్న్‌ సమర్పించే విధానాన్ని 6 నెలల్లో అమల్లోకి  తీసుకురావాల‌ని నిర్ణయించారు.

జీఎస్టీ రిటర్నుల దాఖలుకు ప్రత్యామ్నాయంపైనా చర్చించారు. జీఎస్టీ నెట్‌వర్క్‌ను ప్రభుత్వ సంస్థగా మార్చే ప్రతిపాదనకు కౌన్సిల్‌ సభ్యులు అంగీకారం తెలిపారు. ప్రస్తుతం జీఎస్టీఎన్‌లో ప్రభుత్వానికి 49శాతం, ఇతర సంస్థలకు 51శాతం వాటా ఉంది. ప్రైవేటు సంస్థల దగ్గరున్న 51శాతం వాటాను ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది.