ఈఎస్ఐ లబ్దిదారులకు శుభవార్త

ఈఎస్ఐ లబ్దిదారులకు శుభవార్త

ఈఎస్ఐ (కార్మిక రాజ్య భీమా సంస్థ) లబ్దిదారులకు కేంద్రప్రభుత్వం శుభవార్తను అందించింది. ఈఎస్‌ఐ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సభ్యత్వ రుసుమును తగ్గించింది. సాధారణంగా సభ్యత్వ రుసుములో కొంతభాగాన్ని ఉద్యోగి చెల్లిస్తే.. మిగతా మొత్తాన్ని యాజమాన్యం చెల్లిస్తుంది. ఈ లెక్కన ఉద్యోగి సభ్యత్వ వాటాను 1.74 నుంచి 0.75 శాతానికి, యాజమాన్య వాటాను 4.75 నుంచి 3.25 శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సవరించిన  రుసుములు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.