ఎక్సైజ్‌ సుంకం తగ్గించం

ఎక్సైజ్‌ సుంకం తగ్గించం

పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వం మాత్రం తాము విధిస్తున్న పన్నులను మాత్రం తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ రెవిన్యూ కలెక్షన్స్ అంతంత మాత్రమే ఉన్నాయని, కరెంటు ఖాతా లోటు నిర్దేశిత లక్ష్యంలో 86 శాతానికి చేరుకుందని ప్రభుత్వ అధికారి తెలిపారు. డాలర్ తో రూపాయి భారీగా పతనం కావడతో దిగుమతుల భారం పెరిగిపోయిందని, ఈ సమయంలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తే కరెంటు ఖాతా లోటు హద్దులు దాటుతుందని ప్రభుత్వం భయపడుతోందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారి వెల్లడించారు. ఇపుడున్న పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు చేసినా లెక్క తప్పుందని ప్రభుత్వం భావిస్తోంది. వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్‌ ధరలు సామాన్య ప్రజలను గడగడలాడిస్తున్నాయి. ఇప్పటికే ముంబైలో పెట్రోల్ రేటు రూ. 87కు చేరువ అవుతుండగా, మంగళవారం పెట్రోల్ ధరను 16 పైసలు, డీజిల్ ధరను 19 పైసలు చొప్పను ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలు తగ్గించాయి.