బడ్జెట్‌ ఫోకస్‌: మరింతగా పన్ను బాదుడు

బడ్జెట్‌ ఫోకస్‌: మరింతగా పన్ను బాదుడు

ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం నిధుల వేల ప్రారంభించింది కేంద్రం. వచ్చే పూర్తి స్థాయి బడ్జెట్‌లో నిధులు సమీకరణ కోసం ఉన్న మార్గాలను అన్వేషిస్తోంది. కంపెనీల లాభాలపై విధించే కార్పొరేట్‌  ట్యాక్స్‌ను తగ్గిస్తారని ఎంతో ఆశతో ఉన్న కార్పొరేట్‌ రంగానికి నిరాశే మిగలనుంది. ప్రస్తుతం కార్పొరేట్‌ ట్యాక్స్‌ 30 శాతంగా ఉంది. దీన్ని కనీసం 25 శాతానికి చేయాల్సిందిగా కేంద్రాన్ని కార్పొరేట్‌ రంగం కోరుతోంది. అయితే కేంద్రం మాత్రం ఏమాత్రం తగ్గించకపోగా... ఇతర మార్గాలను వెతుకుతోంది.

క్యాపిటల్ గెయిన్‌ ట్యాక్స్‌

గత బడ్జెట్‌లో క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్ ప్రవేశపెట్టా రు. దీంతో స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర ఒత్తిడి వచ్చింది. కొన్ని మినహాయింపులు ఇచ్చినా.. షేర్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో వచ్చిన లాభాలపై లాంగ్‌ టర్మ్‌  క్యాపిటల్‌ ట్యాక్స్‌  విధించింది. వచ్చే బడ్జెట్‌లో ఈ పన్నును మరింత పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు బిజినెస్‌ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌లో చిన్న ఇన్వెస్టర్లకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. రూ. 5 కోట్ల లోపు టర్నోవర్‌ ఉన్న కంపెనీలకూ పన్ను రేటు తగ్గించారు. అలాగే కొత్త మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీలకు ఇచ్చిన 25 శాతం పన్ను సౌకర్యాన్ని తర్వాత రూ. 50 కోట్ల టర్నోవర్‌ ఉన్న కంపెనీలకు వర్తింపజేశారు. అయితే రైతు పెన్షన్‌ పథకం, ఆయుష్మాన్‌ భవ పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాల్సి ఉన్నందున ఈ రాయితీలు కొనసాగిస్తారా లేదా ఎత్తేస్తారా అన్న టెన్షన్ పారిశ్రామిక వేత్తల్లో ఉంది. అలాగే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పన్ను విషయంలో కూడా ప్రభుత్వం ఈసారి పెద్దగా ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశాల్లేవని తెలుస్తోంది.