స్వర్ణ ప్యాలెస్ ఘటనపై చంద్రబాబు ఎందుకు నోరుమెదపలేదు : జీ శ్రీకాంత్ రెడ్డి

   స్వర్ణ ప్యాలెస్ ఘటనపై చంద్రబాబు ఎందుకు నోరుమెదపలేదు : జీ శ్రీకాంత్ రెడ్డి

స్వర్ణ ప్యాలెస్ ఘటనపై చంద్రబాబు ఎందుకు నోరుమెదపలేదని ప్రభుత్వ చీఫ్ విప్ జీ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏదైనా ప్రమాదం జరిగితే కమిటీలు వేసే చంద్రబాబు నిన్న జరిగిన ప్రమాదంపై ఎందుకు కమిటీ వేయలేదన్నారు. స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు. రమేష్ హాస్పిటల్ నిర్లక్ష్యం వలనే 10 మంది చనిపోయారని ప్రాథమికంగా తేలిందన్నారు.  చంద్రబాబు నిర్వహించిన "జూమ్" కార్యక్రమంలో రమేష్ చౌదరి పాల్గొని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారని అన్నారు. రమేష్ చౌదరి టీడీపీకి చెందిన నేత అని కామెంట్ చేసారు. కరోనా రోగులను దృష్టిలో పెట్టుకొని వైద్యానికి ప్రభుత్వం అనుమతినిస్తే దాన్ని కొన్ని హాస్పిటల్స్ దుర్వినియోగం చేస్తున్నాయన్నారు. ప్రమాదంపై పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తరవాత బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ స్పందించిన తీరు అద్భుతమని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రెండు కమిటీలు ఏర్పాటు చేశారన్నారు. బాధితులకు 50 లక్షల పరిహారం ప్రకటించారని గుర్తు చేసారు. కరోనా నియంత్రణలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. వైజాగ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల్సిన అవసరం తమకు లేదని .. ఏ ప్రాంతంపైనా  దురుద్దేశ్యం లేదని అన్నారు.రాయలసీమ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని తెలిపారు. గతంలో పవన్ కళ్యాణ్ రాజధాని కర్నూల్లో పెట్టాలని మాట్లాడారని అన్నారు. న్యాయ రాజధాని రాయలసీమకు వస్తుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రతి అంశం పై చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి దళిత పోలీస్ అధికారిపై దాడి చేస్తే ఎందుకు నోరు మెడపలేదని ప్రశ్నించారు.