ఇబ్బందులు ఎదురైనా ఆర్టీసీ విలీనం చేసి తీరుతాం

ఇబ్బందులు ఎదురైనా ఆర్టీసీ విలీనం చేసి తీరుతాం

ఆర్టీసీ విలీన ప్రక్రియ నిర్ణయంతో కార్మికులు చాలా సంతోషంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. విలీనంపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని.. ఆర్టీసీ విలీన ప్రక్రియ ఇంత త్వరగా ప్రారంభిస్తారని తామెవరం ఊహించలేదన్నారు. సంస్థ పరంగా ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు సీఎం జగన్ అంగీకరించారని చెప్పారు. విలీన ప్రక్రియను పూర్తి చేయడానికే కమిటీ వేశారని మంత్రి వివరించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆర్టీసీని విలీనం చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మనసున్న మనిషని ప్రశంసించిన పేర్ని నాని, మనసుతో ఆలోచిస్తారు కాబట్టే జగన్ సంక్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరించగలుగుతున్నారని అన్నారు.