ఫాతిమా విద్యార్ధులకు రూ. 2 కోట్లు విడుదల 

 ఫాతిమా విద్యార్ధులకు రూ. 2 కోట్లు విడుదల 

కడప జిల్లా ఫాతిమా కాలేజీ విద్యార్ధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.13 కోట్లు కేటాయించిందని, వారికి న్యాయం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అప్పలనాయుడు తెలిపారు. విద్యార్ధులకు భరోసా కల్పించేందుకు రూ.13 కోట్లు ఇవ్వడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని, అందులో ఇప్పటికే రూ.2 కోట్లు విడుదల అయ్యాయని ఆయన తెలిపారు. చాలా మంది విద్యార్ధులు అదే కాలేజీలో ప్రభుత్వ సొమ్ముతో బీ,సీ కేటగిరీ సీట్లు పొంది మెడిసిన్ చేస్తున్నట్లు ఆయన అన్నారు.