బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమంలో ఎలా పాల్గొనాలి : స్మిత్

బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమంలో ఎలా పాల్గొనాలి : స్మిత్

తమ దేశం లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ను తిరిగి ప్రారంభించిన తర్వాత 'బ్లాక్ లైవ్స్ మేటర్' ఉద్యమంలో ఎలా పాల్గొనాలి అనే విషయాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికా (సిఎస్ఎ) తెలుసుకుంటుంది. వెస్టిండీస్, ఇంగ్లాండ్ క్రికెటర్లు చేసిన విధంగా 'బ్లాక్ లైవ్స్ మేటర్' ఉద్యమానికి తాను మద్దతు ఇస్తానని ఇప్పటికే దక్షిణాఫ్రికా బౌలర్ లుంగి ఎన్గిడి స్పష్టం చేశారు. ఇక ''ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతుందో అనేది అలాగే అందులో మా పాత్ర గురించి మాకు బాగా తెలుసు అయితే అందులో ఎలా పాల్గొనాలి, ఏ విధంగా  'బ్లాక్ లైవ్స్ మేటర్ కు మా మద్దతు తెలపాలి అనేది మేము ఆలోచిస్తున్నం'' అని సిఎస్ఎ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ అన్నారు. నాకు నమ్మకం ఉంది ఏమిటంటే.. మా ఆటగాళ్లు అందరూ ఇందుకు మద్దతిస్తారు. మేము ఈ విరామం తర్వాత ఆడే మొదటి మ్యాచ్ లో వారికి మద్దతు తెలుపుతాము అని అన్నాడు.