ఈ బామ్మ మామూలు బామ్మ కాదు... ఒక చేత్తో కోబ్రాను పట్టుకొని...

ఈ బామ్మ మామూలు బామ్మ కాదు... ఒక చేత్తో కోబ్రాను పట్టుకొని...

మాములు చిన్న చిన్న పాములు చూస్తేనే ఆమడ దూరం పారిపోతాం.  అలాంటిది ఆరు ఏడు అడుగుల పొడవైన పాము కనిపిస్తే ఇంకేమైనా ఉందా చెప్పండి.  చెప్పలేనంత దూరం పారిపోతాం.  అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే, అడవుల్లో నివసించే వ్యక్తులకు పాములంటే పెద్దగా భయం ఉండదు.  చిన్నప్పటి నుంచి వాటితో కలిసి పెరుగుతూ ఉంటారు.  

అందుకే పాములంటే పెద్దగా భయపడరు.  ఈ బామ్మ కూడా అంతే అనుకుంటే, చిన్నప్పుడు పిల్లలు బడికి వెళ్ళాను అని మారం చేస్తుంటే చెయ్యిపట్టుకొని లాక్కెళ్లినట్టుగా, ఆరడుగుల కోబ్రా జాతి పామును తోకపట్టుకొని ఈడ్చుకొని వెళ్ళింది.  అలా ఈడ్చుకెళ్లి దూరంగా ఉన్న అడవిలో విసిరేసింది. మాములు పాములకు కోపం ఎక్కువ.  మరి కోబ్రా జాతి పాములకు ఇంతెంత కోపం ఉంటుందో చెప్పక్కర్లేదు.  కానీ, పాము తోకను పట్టుకొని లాక్కుపోతుంటే... అలానే పడగవిప్పి నిలబడయింది.  పామును చూసి బామ్మ భయపడిందో లేదో తెలియలేదుగానీ, వీడియో మాత్రం తెగ వైరల్ అయ్యింది.