గ్రేటర్ బీజేపీ కార్పొరేటర్ ల కీలక సమావేశం.. మేయర్‌ పీఠమే లక్ష్యం !

గ్రేటర్ బీజేపీ కార్పొరేటర్ ల కీలక సమావేశం.. మేయర్‌ పీఠమే లక్ష్యం !

బీజేపీ కార్యాలయంలో గ్రేటర్ బీజేపీ కార్పొరేటర్ ల సమావేశం కాసేపటి క్రితమే ప్రారంభం అయింది.  రేపు గ్రేటర్ కౌన్సిల్ మీటింగ్ లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.  మేయర్,  డిప్యూటీ మేయర్ స్థానాలకు పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది బీజేపీ. నిన్న అల్ పార్టీ మీటింగ్ అంశాలను కార్పొరేటర్లకు ఈ సమావేశంలో వివరించనున్నారు పార్టీ సీనియర్‌ నేతలు.  అంతేకాదు మేయర్‌ ఎన్నిక నేపథ్యంలో  విప్ ని నియమించనుంది బీజేపీ పార్టీ. రేపు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని కౌన్సిల్ మీటింగ్ కి హాజరు కానున్నారు బీజేపీ కార్పొరేటర్లు. ఇక బీజేపీకి 47 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇద్దరు ఎక్స్ ఆఫీసీయో సభ్యుల బలం ఉంది.