విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్

విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు రూ.8,300 కోట్ల వ్యయంతో మూడు కారిడార్లతో 42.55 కి.మీ పొడవున నిర్మితమవుతుంది. ఈ మేరకు అమరావతి మెట్రో రైల్ కార్పోరేషన్ ఎండీకి అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.ఈ ప్రాజెక్టు కోసం విశాఖలో సుమారు 250 ఎకరాలు కార్పోరేషన్ కు ఉచితంగా కేటాయిస్తారు. ప్రాజెక్టు మార్గం, స్టేషన్లు, పార్కింగ్ ప్రదేశాలు, డిపోల ఏర్పాటుకు 83 ఎకరాల ప్రభుత్వ భూములతో పాటు 12 ఎకరాల ప్రైవేట్ భూములను సేకరించి ఇస్తారు.