పెళ్లి పీటలపై 'పబ్ జీ' ఆడిన వరుడు

పెళ్లి పీటలపై 'పబ్ జీ' ఆడిన వరుడు

పబ్ జీ మొబైల్ వీడియో గేమ్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. ఈ గేమ్ వయస్సు తో సంబంధం లేకుండా అన్ని వయస్సు ల వారు ఆడేస్తారు. ఈ మాయదారి పబ్‌జీ మోజులో పడి ఎంతో మంది ప్రాణాలు తీసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ గేమ్ పచ్చని కాపురాల్లో కూడా చిచ్చు పెడుతోంది. తాజాగా ఓ వరుడు తన పెళ్లిలోనే పబ్‌జీ ఆడుతూ కనిపించాడు.. పెళ్లికి వచ్చిన అతిథులు ఇచ్చే గిఫ్ట్‌ల్ని విసిరికొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఎక్కడ తీశారు.. పెళ్లి ఎక్కడ జరిగిందన్నది క్లారిటీ లేదు. టిక్ టాక్ కోసమే ఈ వీడియో తీశారా.. నిజంగానే వరుడు పబ్‌జీ ఆడాడా అన్నది తెలియలేదు.