కశ్మీర్‌లోకి ఉగ్రవాదులు.. హైఅలర్ట్‌

కశ్మీర్‌లోకి ఉగ్రవాదులు.. హైఅలర్ట్‌

జమ్ముకశ్మీర్‌లోకి అధిక సంఖ్యలో ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం రావడంతో.. జమ్ముకశ్మీర్‌తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా సిబ్బందిని అలెర్ట్ చేశారు అధికారులు. పాకిస్థాన్‌, జమ్ముకశ్మీర్‌ సరిహద్దు ప్రాంతంలోకి సుమారు 12 మంది ఉగ్రవాదులు ప్రవేశించారని అధికారులు తెలిపారు. అయితే కశ్మీర్‌లోకి ప్రవేశించిన ఈ ఉగ్రవాదులు.. జైషే ఈ మహమ్మద్‌ ఉగ్ర సంస్థకు చెందిన వారని అధికారులు గుర్తించారు. చొరబడిన ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఉగ్ర దాడులకు పాల్పడే అవకాశం ఉండటంతో.. కశ్మీర్‌  సహా డిల్లీలో హైఅలర్ట్‌ ప్రకటించారు. భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని.. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని విచారించమని అధికారులు హెచ్చరించారు. ఇక సున్నితమైన ప్రాంతాల్లో పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు.