జీఎస్టీ అతిపెద్ద పిచ్చి పని.. అవినీతి తగ్గాలంటే టాక్స్ రద్దు చేయాలి..

జీఎస్టీ అతిపెద్ద పిచ్చి పని.. అవినీతి తగ్గాలంటే టాక్స్ రద్దు చేయాలి..

ప్రతిపక్షంలో ఉన్నా... అధికార పక్షంలో ఉన్నా... తన అభిప్రాయాన్ని, మనసులో ఉన్న మాటలను కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తుంటారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్యస్వామి.. ప్రజ్ఞా భారతి తెలంగాణ ఆధ్వర్యంలో ఇండియా ఆన్ ఎకనామిక్ సూపర్ పవర్ 2030 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ సుబ్రమణ్య స్వామి... జీఎస్టీ, ఆదాయపన్ను వసూళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. పన్ను సంస్కరణల్లో భాగంగా భారత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ (వస్తువులు మరియు సేవా పన్ను)ను 21 వ శతాబ్దపు అతిపెద్ద పిచ్చి పనిగా అభివర్ణించారాయన. ఏడాదికి 10 శాతం వృద్ధి సాధిస్తే 2030 నాటికి భారత్ సూపర్ పవర్‌గా అవతరిస్తోందన్నారు. 

భారతదేశంలో బ్రిటిషర్ లూటీ చేసిన ఎకనామి 71 ట్రిలియన్స్, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రధాని నెహ్రూ తీసుకున్న కొన్ని నిర్ణయాలతో అభివృద్ధి ఆగాపోయిందన్నారు. అయితే, పీవీ నరసింహారావు సంస్కరణలకు ఆద్యుడిగా అభివర్ణించారు.. పీవీ నరసింహారావు టైమ్‌లోనే 1 శాతం ఉన్న డీజీపీ 8 శాతానికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. ఆదాయపు పన్ను మరియు 21వ శతాబ్దంలో అతిపెద్ద పిచ్చి పని జీఎస్టీ అని... దానితో పెట్టుబడిదారులను భయపెట్టొద్దన్నారు. ఈ జీఎస్టీ చాలా క్లిష్టంగా ఉందన్న ఆయన.. అది ఎక్కడ నింపాలో ఎవరికీ అర్థం కాలేదన్నారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య డిమాండ్ కొరత, ఎందుకంటే ప్రజలకు ఖర్చు చేయడానికి డబ్బు లేదు, తద్వారా ఆర్థిక చక్రానికి ఆటంకం కలుగుతుందన్నారు స్వామి... మీకు 10 శాతం వృద్ధి రేటు కావాలి, అప్పుడు జీడీపీకి పెట్టుబడి రేటు 37 శాతం ఉండాలి మరియు 3.7 శాతం మీ సామర్థ్య కారకంగా ఉండాలి.. ఈ రోజు ఉన్నట్లుగా ఐదు శాతం కాదు అన్నారు. అవినీతిని తొలగించి అధిక ఆర్థిక వృద్ధిని సాధించొచ్చన్న స్వామి... ఆదాయపు పన్నును రద్దు చేస్తే అవినీతి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.