లక్ష కోట్లు దాటిని జీఎస్టీ వసూళ్లు

లక్ష కోట్లు దాటిని జీఎస్టీ వసూళ్లు

అక్టోబర్‌ నెలలో జీఎస్టీ కలెక్షన్స్‌ లక్ష కోట్ల రూపాయిలను దాటాయి. సెప్టెంబర్‌లో రూ. 94,442 కోట్లు ఉన్న జీఎస్టీ అక్టోబర్‌ నెలలో 6.64 శాతం పెరిగి రూ. 1,00,700 కోట్లకు చేరాయి. ఇందులో కేంద్ర జీఎస్టీ రూ. 16,464 కోట్లు కాగా, రాష్ట్రాల జీఎస్టీ రూ. 22,826 కోట్లు. ఉమ్మడి అంటే ఐజీఎస్టీ వసూళ్లు రూ. 53,419 కోట్లు. ఇందులో ఎగుమతుల ద్వారా రూ. 26,908 కోట్లు రాగా... సెస్‌ రూపంలో రూ. 8,000 కోట్లు వసూలయ్యయి.