హీరా గ్రూప్‌పై జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ దాడులు

హీరా గ్రూప్‌పై జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ దాడులు

హీరా గ్రూప్‌ సంస్థలపై జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ దాడులు నిర్వహించారు... సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ ఎగవేత వ్యవహారాలకు సంబంధించిన కేసులో హైదరాబాద్‌లోని హీరాగ్రూప్‌ సంస్థల్లో కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ విభాగం సోదాలు నిర్వహించింది. అధిక వడ్డీల పేరుతో దేశ వ్యాప్తంగా డిపాజిట్లు సేకరించిన హీరా గ్రూపు సంస్థలు 2016 నుంచి సుమారు రూ.30-40 కోట్లకు పైగా సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ ఎగవేసినట్టు గుర్తించారు జీఎస్టీ అధికారులు. దీంతో దేశవ్యాప్తంగా 12 జీఎస్టీ ఇంటలిజెన్స్‌ విభాగానికి చెందిన బృందాలు దాడులు నిర్వహించాయి.